త్వరలో బీహార్ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ… సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తొమ్మిది హైవే ప్రాజెక్టులకు పునాది వేయనున్నారు. ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. దీని కింద బీహార్‌లోని 45,945 గ్రామాలన్నీ ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సేవ ద్వారా అనుసంధానించబడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
తొమ్మిది హైవే ప్రాజెక్టులలో రూ .14,258 కోట్ల వ్యయంతో 350 కిలోమీటర్ల పొడవైన రహదారి ఉంటుంది అని పిఎంఓ ఒక ప్రకటనలో చెప్పింది. ఈ రహదారులు రాష్ట్రంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ, సౌలభ్యం అందిస్తాయని, ఆర్థిక వృద్ధిని పెంచుతాయని, ప్రజలు మరియు వస్తువుల రవాణా కూడా గణనీయంగా మెరుగుపడుతుందని, ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ మరియు జార్ఖండ్ లతో రవాణా మార్గాలు పెరుగుతాయని కేంద్రం చెప్పింది.