కొత్త కరోనా యాప్ లాంచ్ చేసిన సిఎం…!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఒక కరోనా యాప్ ని విడుదల చేసారు. ఇది రాష్ట్రంలో మహమ్మారిని గుర్తించడంలో బాగా సహాయపడుతుంది అని ఆయన చెప్పారు. Labreports.upcovid19tracks.in యాప్ ను ఆయన ప్రారంభించారు. యాప్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “రాష్ట్రంలో మహమ్మారిని గుర్తించేటప్పుడు, చాలా మంది రోగులు, వారి నివేదికలు పాజిటివ్ గా వచ్చినా సరే వారి తప్పు అడ్రస్ లు తప్పు ఫోన్ నెంబర్ లు ఇవ్వడంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం.

అందుకే ఈ యాప్ ని మేము లాంచ్ చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ కు ఏదైనా చికిత్స లేదా వ్యాక్సిన్ వచ్చే వరకు నివారణ చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గం అని అన్నారు. ఈ యాప్ తో కరోనా పేషెంట్ ల సమాచారం మొత్తం తమ వద్ద ఉంటుందని ఆయన చెప్పారు.