కేంద్ర మంత్రితో భేటీ అయిన ఏపీ మంత్రి అనిల్.. దేనికోసమంటే..?

-

తాజాగా ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు అందరితో కలిసి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలను ఆయన ముందు ఉంచారు. అయితే పోలవరం బకాయిలు పునరావాస ప్యాకేజీ లను విడుదల చేయాలంటూ… వీటిలో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… కేంద్ర మంత్రిని కోరినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకు వెళుతుంది అంటూ ఈ భేటీలో తెలిపిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్… 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు ను పూర్తి స్థాయిలో పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించింది అంటూ తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన పలు ప్రాజెక్టుల గురించి కూడా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news