పరిశోధకులు మరియు ప్రజారోగ్య నిపుణుల పారదర్శకత కోసం 111 పేజీల క్లినికల్ ట్రయల్ బ్లూ ప్రింట్ ను కరోనా వైరస్ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా విడుదల చేసింది. మోడరనా మరియు ఫైజర్ తమ అధ్యయనాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చారు. ఈ బ్లూ ప్రింట్ విడుదల తర్వాత కరోనా వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ కోసం ప్రణాళికను ఆన్ లైన్ లో ప్రచురించింది.
భారతదేశంలో కోవిషీల్డ్ అని పిలువబడే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా యొక్క టీకాను దేశంలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పరీక్షించి ఉత్పత్తి చేస్తోంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కనుగొన్న AZD1222 గా పిలువబడే టీకా యొక్క క్లినికల్ ట్రయల్స్ యుకె, భారతదేశం, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికాలో తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ వ్యాక్సిన్ పై ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆశగా ఎదురు చూస్తుంది.