వ్యవసాయ బిల్లులను చర్చించి, సభలో ఆమోదించినందుకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు నిన్న రాజ్యసభలో చేసిన నిరసన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారిలో 8 మందిని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేసారు. డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రాగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్ మరియు ఎలమరన్ కరీంలను సస్పెండ్ చేసారు.
ఇక బిల్లులను ఆమోదించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. “మ్యూటింగ్ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియా” కొనసాగుతోంది అని రాహుల్ ఆరోపించారు. ఇక ఆమోదించిన బిల్లులను నల్ల చట్టాలు అంటూ ఆయన పోల్చారు. నల్ల వ్యవసాయ చట్టాల విషయంలో కనీసం రైతుల మనోభావాలను పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం యొక్క అంతులేని అహంకారం మొత్తం దేశానికి ఆర్థిక విపత్తును తెచ్చిపెట్టిందని అని ఆయన ఆరోపించారు.