ఏపీలో హిందూ దేవుళ్ళ విగ్రహాల మీదా, గుడుల మీద వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్వేది రధం దగ్ధం ఘటన, బెజవాడ దుర్గమ్మ రధం సింహాల మాయం చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు శ్రీ భైరవస్వామి ఆలయంలో క్షుద్ర పూజల కలకలం రేగింది.
పూజలు నిర్వహించి కాలభైరవ స్వామి అంగాన్ని దుండగులు ధ్వంసం చేసినట్టు గుర్తించారు. గతంలో ఇలాగే కాలభైరవ స్వామి అంగాన్ని ధ్వంసం చేసి అంగ భాగంలో కొంత ఎత్తు కెళ్ళారు దుండగులు. మిగిలిన అంగ భాగాన్ని రాయితో కొట్టి ఇప్పుడు అగంతకులు తీసుకెళ్లినట్టు గుర్తించారు.
క్షుద్ర పూజల కోసం తీసుకెళ్లి ఉంటారని ఆలయ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది.