కథ డిమాండ్ చేస్తే అందుకు రెడీ

-

మాస్ మహరాజ్ రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ సినిమాతో పాటుగా తన కెరియర్ విషయాలను మీడియాతో పంచుకున్నారు.

సినిమా పరంగా తాను ఏం చేసేందుకైనా సిద్ధమే అంటున్న రవితేజ క్రేజ్ ఉన్నంత వరకు హీరోగా చేసిన ఆ తర్వాత విలన్ రోల్స్ చేసేందుకైనా వెనుకాడననంటున్నారు. అంతేనా క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా తాను చేసేందుకు సిద్ధం అనడం విశేషం. కథ డిమాండ్ చేస్తే ప్రతినాయకుడిగా చేసేందుకు తాను రెడీ అంటున్నాడు రవితేజ. ఇక మల్టీస్టారర్స్ పై కూడా స్పందించిన రవితేజ తనకు నచ్చే కథతో వస్తే ఏ హీరోతో అయినా చేస్తా అంటున్నారు.

నేల టిక్కెట్టు ఫ్లాప్ తో ఢీలా పడిన రవితేజకు అమర్ అక్బర్ ఆంటోనీ అయినా హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. శ్రీను వైట్లతో నీకోసం, వెంకీ, దుబాయ్ శీను సినిమాలు చేసిన రవితేజ ఈ ట్రిపుల్ ఏపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news