కంగ‌న‌ను ఇరికిస్తున్న‌ న‌గ్మ!

-

బాలీవుడ్ డ్ర‌గ్స్ వివాదం రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. రెండు జాతీయ పార్టీల మ‌ధ్య ర‌చ్చ‌కు తెర‌లేపుతోంది. ఇందుకు న‌టి, కాంగ్రెస్ నాయ‌కురాలు న‌గ్మ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు అద్ధం ప‌డుతున్నాయి. ఒక‌ప్పుడు తాను డ్రగ్స్ కు బానిస‌న‌య్యాన‌ని కంగ‌న ర‌నౌత్ స్వ‌యంగా చెప్పినా ఎన్సీబీ అధికారులు మాత్రం ఆమెకు ఎందుకు స‌మ‌న్లు జారీ చేయ‌డం లేద‌ని న‌గ్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసుని డ్ర‌గ్స్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు  రియాను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

రియా సోద‌రుడిని ఇప్ప‌టికే అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు తాజాగా టాలెంట్ మేనేజ‌ర్ జ‌య సాహా వాట్సాప్ సందేశాల ఆధారంగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌లు దీపిక‌, శ్ర‌ద్ధా క‌పూర్‌, సారా అలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ ల‌కు స‌మ‌న్లు పంప‌డం తెలిసిందే. అయితే వాట్సాప్ సందేశాలను ఆధారం చేసుకుని  స‌మ‌న్లు జారీ చేయ‌డాన్ని న‌గ్మ త‌ప్పుప‌ట్టింది. ఎన్సీబీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దియా, దీపిక‌, అనురాగ్ ఒక‌ప్పుడు బీజేపీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు కాబ‌ట్టే ఇప్పుడు వారిపై క‌క్ష సాధిస్తున్నార‌ని సంచ‌ల‌న ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news