ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గత కొన్ని రోజుల నుంచి బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే మరోసారి మీడియాతో మాట్లాడిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు… బీజేపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
టిఆర్ఎస్ పార్టీ చేతుల పార్టీ అయితే బిజెపి పార్టీ మాత్రం మాయమాటలు పార్టీ అంటూ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అంతేకాదు బిజెపి పార్టీకి సరికొత్త పేరు పెట్టారు మంత్రి హరీష్ రావు. బీజేపీ పార్టీ అంటే… బహుత్ బోల్నేకే పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి 10 వేల కోట్లు రావాల్సి ఉందని.. ఆ నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తూ వస్తోంది అని విమర్శించారు మంత్రి హరీష్ రావు. అన్ని రంగాలకు సంబంధించి కేంద్రం బకాయిలు పెడుతుంది అంటూ తెలిపారు.