బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణ ముగిసింది. వీరికి తప్ప ఇంకెవరికీ సమన్లు ఇవ్వలేదని ఎన్సీబీ అధికారులు ప్రకటించారు. దీపికకు రెండోసారి సమన్లు ఇవ్వమని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు హీరోయిన్లను ప్రశ్నించామని అధికారులు పేర్కొన్నారు. ఈరోజు ఆ నలుగురి స్టేట్మెంట్ లను రికార్డ్ చేశామని అన్నారు. సారా ఆలీఖాన్, శ్రద్దా కపూర్ లను రెండు కేసుల్లో ప్రశ్నించామని అధికారులు పేర్కొన్నారు.
ఇక కరణ్ జోహార్ కు ఈ కేసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. కేవలం దీపిక చాటింగ్ ను మాత్రమే పరిశీలించామని సుశాంత్ కేసు ఆధారంగానే వీరిని ప్రశ్నించామని పేర్కొన్నారు. రియా చక్రవర్తి సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ పేర్లు చెప్పిందని, కానీ విచారణలో మాత్రం వారిద్దరూ డ్రగ్స్ వాడలేదని తెలిపారని అన్నారు. ఈ కేసులో ధర్మా ప్రొడక్షన్ కు చెందిన క్షితిస్ ప్రసాద్ ను అరెస్ట్ చేశామని అధికారులు ప్రకటించారు.