ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ లో) పరీక్ష జరుగనుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 78,970మంది విద్యార్థులు హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో అధికారులు అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ఆన్లైన్ పద్ధతిలో ఎంసెట్ జరుగనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంసెట్ నిర్వహిస్తున్నామని జేఎన్టీయూ అధికారులు పేర్కొంది. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పరీక్ష కేంద్రానికి రావాల్సి ఉంటుంది స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించేలా పరీక్షా కేంద్రాల వద్ద చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని ఎగ్జామ్ సెంటర్లను పూర్తిగా శానిటైజ్ చేశామని జేఎన్టీయూ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష ముగిసిన విషయం తెలిసిందే.