భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కేసులు ఎంత ఎక్కువగా నమోదు అవుతున్నాయో ? రికవరీలు కూడా అంతే రేంజ్ లో ఉంటున్నాయి. తాజాగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం దేశంలో మొత్తం రికవరీలు నేటి ఉదయానికి 50 లక్షలు దాటాయి. అయితే మొత్తం రికవరీలలో, గత 11 రోజులలో 10 లక్షల రికవరీ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ తాజా గణాంకాల ప్రకారం, జూన్ 3 నుండి రికవరీల సంఖ్య రోజూ పెరుగుతూ వస్తోంది. గత పది రోజుల్లో రోజూ సుమారు లక్షకు చేరువలో రికవరీలు నమోదవుతూ వస్తున్నాయి. ఇక జూన్ మూడుకి లక్ష మంది కరోనా నుంచి కోలుకోగా, జులై 30కి 10 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలానే 19 ఆగస్ట్ కి 20 లక్షల మంది కోలుకోగా సెప్టెంబర్ నాలుగుకి 30 లక్షల మంది కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది. సెప్టెంబర్ 17 కి 40 లక్షల మంది కోలుకోగా 28 సెప్టెంబర్ కి 50 లక్షల మంది కోలుకున్నారు.