వైరస్ ఇంకా పోలేదు… మాస్ గాధరింగ్ కి దూరంగా ఉండాల్సిందే !

-

గతంలో సెప్టెంబర్ లో తగ్గుతాయని చెప్పినట్టుగానే తగ్గుదల క్లియర్ గా కనిపిస్తుందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. డెత్ రేట్ కూడా చాలా తగ్గిందన్న ఆయన మొత్తం 15.42% కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. తెలంగాణలో ప్రతిరోజు 50వేలకు పైగా టెస్టులు చేస్తున్నామని జూన్ మాసం లో అత్యధికంగా పాజిటివ్ పర్సెంటేజ్ నమోదు అయిందని అన్నారు. జూన్ లో 23%, జులైలో 13%, ఆగస్ట్ లో 7%, సెప్టెంబర్ లో 4% నమోదు అయిందని అన్నారు. GHMC స్థాయిలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయన్న అయన రాష్ట్ర స్థాయిలో కూడా చాలా వరకు తగ్గుతున్నాయని అన్నారు. రికవరి రేట్ కూడా తెలంగాణలో ఎక్కువ గా ఉందన్న ఆయన కేబుల్ బ్రిడ్జ్ వద్ద విపరీతంగా జనాలు గుమికూడటం ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

వైరస్ ఇంకా పోలేదు… మాస్ గాధరింగ్ కి దూరంగా ఉండటం ఉత్తమమని అన్నారు. ప్రజల జనజీవనం కోవిడ్ కి ముందు…. కోవిడ్ తరువాత అని చూస్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అన్ని రంగాల్లో అన్ లాక్ అవుతుంది కాబట్టి ప్రజలు కూడా అలెర్ట్ గా ఉంటున్నారని అన్నారు. టెస్టులు సంఖ్య పెంచుతున్నామన్న ఆయన నిజానికి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే కాలం అయినప్పటికీ కరోనా వల్ల జనాల్లో జాగ్రత్తలు పెంచడంతో చాలావరకు సీజనల్ వ్యాధులు నమోదు చాలా తక్కువగా ఉందని అన్నారు. ప్రజల్లో అవగాహన చాలా పెరిగింది.. పోషకాహారం తీసుకోవడం… పరిశుభ్రంగా ఉండటం చాలా ఉపయోగకరo గా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news