ఇదేం వింత : వరి పంట వేస్తే పసుపు రాలుతోంది !

-

రంగారెడ్డి జిల్లాలో వింత ఘటనా ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే యాచారం మండలం నానక్ నగర్ గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు వరి పంట వేయగా ఆ వరి కంకుల నుంచి పసుపు రాలుతున్న సంగతి వెలుగు లోకి వచ్చింది. వరి ఒడ్లు బదులుగా చిన్న చిన్న పసుపు కొమ్ములు మాదిరిగా మరో పంట రావడంతో రైతులు అవాక్కయ్యారు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ గ్రామం లో ముగురు రైతు పొలంలో దాదాపు 9 ఎకరాలు వరి పంటకు వేయగా చేతికొచ్చే క్రమంలో చిన్న చిన్న, పసుపుకొమ్ములు మాదిరిగా, వరి పంట, పసుపు కలర్ రావడంతో ఆ ముగ్గురూ షాక్ అయ్యారు. కల్తీ విత్తనాలతో ఇలా జరిగిందని ఆ ముగ్గురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ కల్తీ విత్తనాలు అమ్మి మోసం చేసిన వ్యక్తులని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంటల మార్పిడి పేరుతో సన్న బియ్యం పండించాలనే పిలుపు మేరకు అధిక డబ్బు పెట్టి మరీ సోనా మసూరీ పంట వేశామని ఇలా జరిగితే ఇప్పుడు ఏమి చేయాలో కూడా అర్ధం కావడం లేదని వారు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news