వివాదంలో చిక్కుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే.. ఆడియో లీక్ !

-

కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. గాజులరామారం వీఆర్‌వో శ్యామ్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన విరుచుకుపడుతున్న ఆడియో ఒకటి వైరల్ గా మారింది. వీఆర్‌వో శ్యామ్‌ పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ రెవెన్యూ సిబ్బందితో మాట్లాడిన సదరు ఆడియో లీక్ అయింది. ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో సర్వత్రా చర్చ మొదలయింది.

అక్రమ కట్టడాలు అని భావిస్తున్న ఇళ్ళ నుండి కరెంటు మీటర్లు లాక్కుని వెళ్లారు వీఆర్వో శ్యాం కుమార్. దీంతో ఈ అంశం గురించి మాకు న్యాయం చేయమని మహిళలు అందరూ ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. దీంతో వారి ముందే ఫోన్ చేసిన ఎమ్మెల్యే వివేక్‌ రెవెన్యూ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను రమ్మంటే రావా ? కిందేసి తోక్కుతా ! అంటూ పరుష పదజాలంతో అయన విరుచుకుపడ్డారు. దీంతో ఎమ్మెల్యే వివేక్‌ తీరుపై రెవెన్యూ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news