భారీగా నగదు పట్టివేత.. దుబ్బాక ఎన్నికల కోసమేనా ?

-

హైదరాబాద్ శివారు శామీర్‌పేటలో భారీగా నగదు పట్టుబడింది. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్డు నుండి శామీర్ పేటకు ఓ కారులో పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులతో కలిసి శామీర్ పేట పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించగా హుండా క్రేటా కారులో సుమారు 48 లక్షల నగదు పట్టుబడింది. కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకొని, నగదును శామీర్‌పేట పోలీసులకు అప్పగించారు. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు ? దీనికి సంబంధించి పూర్తి పత్రాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరగగా కారులోని వ్యక్తులు ఈ డబ్బుకు సంబంధించిన వివరాలను సరిగా చెప్పలేకపోయారు.

పోలీసులతో పొంతన లేని సమాధానం చెప్పడంతో శ్రీనివాస్ బాబు,ఆంజనేయులు, మజీద్,సురేష్ అనే వ్యక్తులను శామీర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక కోసమే ఈ డబ్బును తరలిస్తున్నారని, బిజెపి పార్టీకి చెందిన అభ్యర్థికి చెందిన డబ్బు అందించే క్రమంలో నిందితులు పట్టుబడ్డారని పోలీసుల విచారణలో తేలింది. కాగా నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు రూ. 40 లక్షలు తరలిస్తున్నారన్న పోలీసుల ప్రశ్నలకు నిందితులు పెదవి విప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news