చైనాకు చెక్‌ పెట్టడానికి భారత్‌ మరో వ్యూహాత్మక ఎత్తుగడ.!

-

ఆసియాలో చైనా అధిపత్యాన్ని నిలువలరించడానికి భారత్ ఫ్యూహత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు వెలుతుంది..ఇండో-పసిఫిక్ వివాదంపై చర్చించడానికి భారతదేశం, జపాన్, యుఎస్ మరియు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఈరోజు టోక్యోలో సమావేశం కానున్నారు..ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశం సాయంత్రం జరగనుంది..క్వాడ్ నాయకులు బీజింగ్ ఎత్తుగడలను అడ్డుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది..ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా అధిత్య ధోరిణికి ప్రతిస్పందనగా ఈ సమావేశం కనిపిస్తుంది. భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల మధ్య క్వాడ్ విదేశాంగ మంత్రుల మొదటి సమావేశం ఇది..గత ఏడాది ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా క్వాడ్ నాయకుల సమావేశం జరిగింది.క్వాడ్ సమావేశం ఈ ప్రాంతంలోని వ్యూహాత్మక మరియు భద్రతా సవాళ్లపై దృష్టి సారిస్తుందని మరియు ఉమ్మడి వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news