పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేసిన కేసులో ఆ న‌టుడి అరెస్టుకు రంగం సిద్ధం..!

-

న‌టుడు, బిగ్‌ బాస్‌ దర్శిన్ అరెస్ట్‌కు రంగం సిద్ధ‌మైంది. దర్శిన్‌ను ఏ క్ష‌ణ‌మైనా పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే… తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తున్న సనంశెట్టి, నటుడు దర్శిన్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవ‌ల‌ దర్శిన్ తనను దూరం పెడుతున్నాడ‌ని, త‌న‌తో మాట్లాడడం మానేశాడని, తనను పెళ్లి చేసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నాడని నటి సనంశెట్టి ఆరోపించారు. నటుడు దర్శిన్, తాను ప్రేమించుకున్నామని..పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఏడాది పాటు కలిసి తిరిగామని తెలిపింది.

ఈ క్ర‌మంలోనే న‌టుడు, బిగ్‌ బాస్‌ దర్శిన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సనంశెట్టి పోలీసుల‌ను ఆశ్రయించింది. ఈ మేర‌కు ఆమె చైన్నైలోని ఆడయారు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో దర్శిన్‌ పై ఫిర్యాదు చేశారు. కాగా సనంశెట్టి ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి దర్శిన్‌ పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కాగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శిన్‌ పై కేసు నమోదు చేశారు. ఈ క్ర‌మంలోనే నేడో, రేపో న‌టుడు ద‌ర్శిన్‌ను పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని కోలివుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా స‌నంశెట్టి ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్శిన్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news