దుబ్బాక ఉప ఎన్నికతో తెలంగాణలో రాజకీయ వేడి మరోసారి రాజుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే అనారోగ్యం బారిన పడి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యం గా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి ప్రకటించకపోవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవలే దుబ్బాక నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత రెడ్డి ని టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం.
ఈ క్రమంలోనే సోలిపేట సుజాత రెడ్డిని ఆర్థిక మంత్రి హరీష్ రావు తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే రామలింగారెడ్డి తమ వద్ద లేకపోవడం బాధాకరమని… పార్టీ ఆవిర్భావం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు అంటూ హరీష్ రావు తెలిపారు. ఇక దుబ్బాక ఎన్నికల్లో మరోసారి గెలిచి సోలిపేట సుజాత రెడ్డి ద్వారా రామలింగారెడ్డి ఆశయాలను నిలబెడతాము అంటూ తెలిపారు.