బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రవికృష్ణ. `వరూధినీ పరిణయం` సీరియల్‌తో బుల్లితెర వీక్షకుల్ని ఆకట్టుకున్న రవికృష్ణ బిగ్‌బాస్ 3లో సందడి చేసిన విషయం తెలిసిందే. అతి మంచివాడుగా బిగ్‌బాస్ షోలో పేరు తెచ్చుకుని మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆయన తాజాగా తన సహ నటితో ప్రేమలో వున్నారట. బిగ్‌బాస్ సీజన్ 3 తరువాత `ఆమె కథ`తో కొంత నెగెటివ్ పాత్రలో కనిపించాడు.
అందులో నటిస్తున్న క్నడ సుందరి నవ్యాసామితో చనువుగా వుంటున్నాడని,ఈ ఇద్దరూ ప్రేమలో వున్నారంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముందు నవ్యా స్వామి కరోనా బారిన పడగా ఆమె తరువాత రవికృష్ణకు కరోనా సోకిన విషయం తెలిసిందే. నవ్యా స్వామి వల్లే రవికృష్ణ కరోనా సోకిందని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని, తనకు ఎవరి వల్లనో కరోనా సోకలేదనరి వివరణ ఇచ్చాడు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి క్రేజీ యాంకర్ సుమ నిర్వహిస్తున్నక్యాష్ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నవ్యా స్వామి ఆడియన్స్ ముందే రవికృష్ణకు ప్రపోజ్ చేయడం.. వెంటనే రవికృష్ఱ ఆమెను కిస్ చేయడంతో సుమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. షోలో భాగంగా నవ్యాస్వామి ప్రపోజ్ చేస్తే స్క్రిప్ట్‌లో లేకుండానే ఎలా ముద్దు పెట్టవని సుమ నిలదీయడంతో షో రక్తకట్టాలనే కిస్ చేశానని రవికృష్ణ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.