చతిస్ ఘడ్ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో మావోయిస్టుల దాడులు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఇక మావోయిస్టులను ఎప్పటికప్పుడు జవాన్లు తిప్పికొడుతూన్నప్పటికీ మావోయిస్టులు మాత్రం మరింత రెచ్చిపోయి జనావాసాల్లోకి వచ్చి మరి కాల్పులకు తెగబడిన ఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఇటీవలే ఏకంగా ఇద్దరు జవాన్లపై మూకుమ్మడిగా కాల్పులకు తెగబడ్డారు మావోయిస్టులు. స్థానికంగా ఈ ఘటన ఎంతగానో కలకలం సృష్టించింది.
ఇక గ్రామస్తుల సహకారంతో ఇద్దరు జవాన్లు మావోయిస్టులను తిప్పికొట్టారు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్ ఘడ్ లోని సుకుమా జిల్లా కొండ గామ్ ప్రాంతంలో తండ్రి మరణించడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇద్దరు జవాన్లు వచ్చారు. ఈ క్రమంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు జవాన్లు మావోయిస్టుల దాడిని తిప్పి కొట్టారు. ఇక ఇందుకు గ్రామస్తులు కూడా సహకారం అందించడంతో మావోయిస్టులు చివరికి దాడులను విరమించుకుని అడవుల్లోకి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.