నేడు కోర్టు ముందుకు ఓటుకు నోటు కేసు నిందితులు

-

నాంపల్లి స్పెషల్ సెషన్స్ కోర్ట్ లో ప్రజా ప్రతినిధులపై కేసుల్లో నేడు విచారణ జరగనుంది. ఇకపై రోజువారి విచారణ చేయాలని సుప్రీం ఆదేశాలతో అన్ని కోర్టులలో ఉన్న ప్రజాప్రతినిధుల కేసుల్ ఫైల్స్ దుమ్ము దులిపి లైన్ లో పెట్టారు. ఇక ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్‌సింహ తదితరులు ఉన్నారు.

ఈ రోజు నిందితులు అందరూ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో కీలకంగా ఆడియో టేపుల స్వరనమూనా మీద ఎఫ్‌ఎస్ఎల్ రిపోర్ట్ కీలకం కానుంది. ఇక ఈ కేసు అనే కాక అన్ని కేసులని విచారిస్తుండంతో చాలా మంది నేతలు కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. నాంపల్లి స్పెషల్ సెషన్స్ కోర్ట్ ముందర నేరుగా పలువురు ప్రజాప్రతినిధులు విచారణకు హాజరు కానున్నారు. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసుల్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news