14 రీల్స్ తో హరీష్ శంకర్

-

కొన్నిసార్లు ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది.. అలా సిని పరిశ్రమలో తరచు జరుగుతూనే ఉంటుంది. ఒక దర్శకుడు ఒకే నిర్మాతతో సినిమా తీస్తుంటే అది వారిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ అనుకుంటాం కాని ఆ నిర్మాత అతన్ని వాడుకుంటున్నాడు అన్నది గుర్తించలేం. తాజాగా అది తానే గుర్తించిన దర్శకుడు ఆ నిర్మాత కాంపౌండ్ నుండి బయటకు వచ్చాడు. ఆ నిర్మాతతో రెండు సినిమాలు తీసిన దర్శకుడు మల్టీస్టారర్ కథ చెప్పగానే ముందు ఓకే అన్నా తర్వాత హ్యాండ్ ఇచ్చాడట.

అందుకే ఇక ఆ నిర్మాత దగ్గర ఉంటే పనికాదనేసి బయటకు వచ్చేశాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరన్నది ఇప్పటికే గెస్ చేశారనుకుంటా అవునండి అతనే గబ్బర్ సింగ్ హరీష్ శంకర్. బన్ని డిజే తర్వాత దాగుడుమూతలు సబ్జెక్ట్ రాసుకున్న హరీష్ శంకర్ ఇన్నాళ్లు దిల్ రాజు ఆ సినిమా నిర్మిస్తాడన్న ఆశలో అతని దగ్గరే ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ కుదరదని చెప్పేసరికి బయటకు వచ్చేశాడు.

ప్రస్తుతం హరీష్ శంకర్ 14 రీల్స్ తో కథా చర్చలు జరుపుతున్నాడట. ఇప్పటికే 14 రీల్స్ ముగ్గురిలో అనీల్ సుంకర బయటకు వచ్చేశాడు. సెపరేట్ గా పెట్టుకున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ లోనే సినిమాలు చేస్తున్నాడు. రాం ఆచంట, గోపి ఆచంట మాత్రమే 14 రీల్స్ మెయింటైన్ చేస్తున్నారు. వారికి హరీష్ శంకర్ కథ నచ్చిందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news