దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎస్బిఐ కస్టమర్లందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్లైన్ నగదు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోవడంతో స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. అయితే ఇలా ఆన్లైన్ సేవలకు అంతరాయం కలగడం పై స్పందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… తమ కస్టమర్లు అందరికీ క్షమాపణ చెప్పి అండగా నిలవాలి అంటూ కోరింది.
ఆన్లైన్ సేవలకు అంతరాయం కలగడం పై చింతిస్తున్నాము అంటూ తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… కస్టమర్లందరూ తమను క్షమించాలి అంటూ కోరింది. కనెక్టివిటీ సమస్య ఏర్పడడం కారణంగానే… కేవలం ఏటీఎం మినహా అన్ని ఛానళ్లు నిలిచి పోయాయి అంటూ తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఆన్లైన్ సేవలను పునరుద్ధరించే పనుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిమగ్నమైందని.. కస్టమర్లందరూ తమకు అండగా నిలవాలి అంటూ కోరింది.