గ్లామర్ పాత్రలు చేస్తా కానీ అలాంటి పాత్రల్లో నావల్ల కాదు : పూజ హెగ్డే

-

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతూ… స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా హెగ్డే. ప్రతి సినిమాలో తన గ్లామర్ డోస్ పెంచుతూ తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. ఇక పూజా హెగ్డే అందానికి తెలుగు ప్రేక్షకులందరూ పగటి కలల్లోనే ఉంటున్నారు అని చెప్పాలి. నేడు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతోంది. పెద్ద ఎత్తున అభిమానులు అందరూ పూజ హెగ్డే కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే ఇటీవలే ఓ ఆసక్తికర విషయం చెప్పి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది పూజా హెగ్డే. తాను కేవలం గ్లామర్ పాత్రల్లో మాత్రమే నటిస్తానని లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేయలేను అంటూ చెప్పుకొచ్చింది. తన పేస్ ఫిజిక్ లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు సెట్ కాదని… సెట్ అవ్వని పాత్రలను చేసి చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే గ్లామర్ పాత్రలు చేసి సరదాగా ముందుకు వెళ్ళడమే తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. గ్లామర్ పాత్రలు చేస్తానని పూజా హెగ్డే క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news