మురళీధరన్ గా విజయ్ సేతుపతి.. మోషన్ పోస్టర్ అదిరింది..

-

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం తెరమీదకి రాబోతున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో 800వికెట్లు తీసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సాధించిన ఈ ఆటగాడి జీవితం వెండితెర మీదకి రాబోతుంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజైంది. 800వికెట్లు తీసుకున్నందుకు గాను 800 అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది.

మోషన్ పోస్టర్ లో చూపించిన దాని ప్రకారం ఈ సినిమాలో మురళీధరన్ జీవితంలోని అన్ని పార్శ్వాలు కనిపించేలా ఉన్నాయి. చిన్నప్పటి నుండి మొదలుకుని అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు అతడు ఎదుర్కొన్న ఒడిదుడుకులు స్పష్టంగా చూపించబోతున్నారు. ఎమ్ ఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news