చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మంగళవారం దక్షిణ ప్రావిన్స్ గువాంగ్ డాంగ్ లోని ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. సైనికులు యుద్దానికి సిద్దంగా ఉండాలని, యుద్ధం కోసం మానసికంగా, శారీరకంగా సిద్దం కావాలని ఆయన సూచించారు. చావోజౌ నగరంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్ప్స్ ను పరిశీలించిన సందర్భంగా కూడా ఆయన ఈ ఈ ఆదేశాలు ఇచ్చారు.
అయితే ఆయన ఏ దేశ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి ఈ ఆదేశాలు ఇచ్చారు అనే దానిపై మీడియా స్పష్టత ఇవ్వలేదు. భారత్, చైనా సరిహద్దుల్లో చైనా కొన్నాళ్ళుగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు మరోసారి అదే వైఖరితో అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చి ఉంటారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే సరిహద్దుల్లో 60 వేల మంది చైనా సైనికులు ఉన్నారని అమెరికా చెప్పింది.