ఏపీ డీజీపీ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. సుప్రీంలో పిటిషన్ !

-

ఏపీ డీజీపీ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం కొద్ది రోజుల క్రితం దుమారం రేపింది. గతంలో అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీంతో బాధితుడి మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ కేసుపై విచారణ సందర్భంలో హైకోర్టు ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండి పడింది. అంతే కాదు పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది.

గతంలో డీజీపీని పలుమార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదన్న హైకోర్టు.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో హైకోర్టు వ్యాఖ్యలపై అడ్వకేట్ కోటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పోలీస్ శాఖ ను కించపరిచే విధంగా హైకోర్టులో వ్యాఖ్యానించడం తగదని ఆయన పిటిషన్ దాఖలు చేసారు. హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కిందిస్థాయి సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కోటేశ్వరావు పిటిషన్ ను పీల్ గా స్వీకరించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ కొరకు కేసును వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news