టీటీడీ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. శ్రీవారి నిధులను బాండ్ల రూపంలో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఈ విషయం మీద ఇప్పుడు అందరూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ..ట్విట్టర్ వేదికగా టీటీడీ, ప్రభుత్వం పై ధ్వజమెత్తిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు శ్రీవారి నిధులు మళ్ళీoపు పై టీటీడీ వివరణ ఇస్తే బాగుంటుందని అన్నారు. శ్రీవారి నిధులను బాండ్ల రూపంలో పెట్టే దానికి టీటీడీకి అర్హత వుందా…? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే టీటీడీ శ్రీవారి నిధులను బాండ్ల రూపంలో ప్రభుత్వానికి మళ్లిస్తోందని అన్నారు.
టిటిడి వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే “ఛలో తిరుపతి” కి పిలుపునిస్తామని హిందూ ధర్మం సంస్థ ప్రతినిధి శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల మీద శ్రీవారి భక్తులకు నమ్మకం లేదని, గతంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన బాండ్లని జగన్ ప్రభుత్వం ఆనర్ చేయలేదని అన్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చే బాండ్లు తరువాత వచ్చే ప్రభుత్వాలు ఆనర్ చేస్తాయన్న గ్యారెంటీ ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. అసలు టిటిడి ధార్మిక సంస్ధా? లేకపోతే వడ్డీ వ్యాపార సంస్ధ అని టిటిడి ట్రస్టు బోర్డు అనుకుంటోందా? అని ఆయన ప్రశ్నించారు. శ్రీవారి సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం బాండ్లలో పెడితే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన అన్నారు.