రెండ్రోజులు పాటు గ్యాప్ ఇచ్చిన వర్షాలు హైదరాబాద్ లో మళ్లీ దంచి కొడుతున్నాయి. కొద్ది సేపటి నుండి లక్డీ కపూల్, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం మొదలయింది. అమీర్ పేట, పంజా గుట్ట, కూకట్ పల్లి మొదలగు చోట్ల కూడా కుండ పోత కురుస్తుండడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.
ఇక మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా అక్టోబర్ 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్ని చోట్ల, రేపు మరియు ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అలానే రాగల మూడు రోజులు ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.