అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. శుక్రవారం మాట్లాడుతూ, చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ముస్లింల విషయంలో ఒక మారణ హోమానికి దగ్గరగా ఏదో చర్య జరుగుతుంది అని అనుమానం వ్యక్తం చేసారు. “ఒక మారణ హోమం లేదా…, దానికి దగ్గరగా ఏదో జిన్జియాంగ్ లో జరుగుతోంది” అని ఆస్పెన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఆన్ లైన్ ఈవెంట్ తో మాట్లాడుతూ అన్నారు.
హాంకాంగ్ లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంలో చైనా అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. జిన్జియాంగ్‌లో ఉయ్ఘర్ మరియు ఇతర మైనారిటీ ముస్లింలపై చైనా వ్యవహరించే తీరుని అమెరికా తీవ్రంగా ఖండించింది. అక్కడ మారణ హోమం దారుణంగా జరుగుతుంది అని చెప్పారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం జిన్జియాంగ్‌లో ఒక మిలియన్ మందికి పైగా ముస్లింలను అదుపులోకి తీసుకున్నారు. అయితే చైనా మాత్రం అమెరికా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.