వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. జి హెచ్ ఎం సి యంత్రాంగం, కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలపై జి హెచ్ ఎం సి యంత్రాంగంకు స్వయంగా మంత్రి కేటిఅర్ దిశా నిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆయనతో పాటుగా… చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ అధికారులతో మాట్లాడుతున్నారు.
సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో తిరిగి కమీషనర్, జోనల్ కమీషనర్లు,అదనపు కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు మానిటరింగ్ చేస్తున్నారు. పంపులు ఏర్పాటు చేసి కాలనీలు, సెల్లార్లలో నిలిచిన నీటిని బయటకు ఇంజనీరింగ్, డి ఆర్ ఎఫ్ సిబ్బoది పంపింగ్ చేస్తున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేస్తున్నారు. వరదతో రోడ్లు, నాలాల్లోకి కొట్టుకు వచ్చిన చెత్త, చెదారం, భవన నిర్మాణ, శిధిల వ్యర్ధాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అంటువ్యాదుల నివారణ కై వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి, యాంటీ లార్వా, సోడియం హైపో క్లోరైట్ క్రిమిసంహారకాలను ఎంటమాలజి, డి ఆర్ ఎఫ్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది స్ప్రే చేస్తున్నారు.