కొడుకు పుట్టలేదని కూతుర్ని గోడకు కొట్టి చంపిన తల్లి

పంజాబ్‌ లోని లూధియానాలో 30 ఏళ్ల మహిళ శనివారం దారుణానికి పాల్పడింది. తన 4 ఏళ్ల కుమార్తెను గోడకు కొట్టి చంపేసింది. మీడియాకు వచ్చిన సమాచారం ప్రకారం… ఇటీవల ఆమెకు మరో ఆడపిల్ల పుట్టింది. దీనితో కోపం ఆపుకోలేని ఆ మహిళ బాత్ రూమ్ గోడకు కొట్టి తన పెద్ద కుమార్తెను చంపేసింది. మహిళ బీహార్‌కు చెందిన వలస కూలీ భార్య అని పోలీసులు తెలిపారు.

“సేలం తాబ్రీ ప్రాంతంలోని నవనీత్ నగర్ లో ఈ ఘటన జరిగింది జాతీయ మీడియాకు పోలీసులు చెప్పారు. మహిళను టింకు యాదవ్ అనే వ్యక్తి భార్య ప్రియాంకగా గుర్తించారు. రెండు నెలల క్రితం, ఆమె తన రెండవ కుమార్తెకు జన్మనిచ్చింది. స్నానం చేయించడానికి తీసుకుని వెళ్ళింది అని, ఆ తర్వాత గోడకు పెట్టి కొట్టింది అని గాయం తీవ్రం కావడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు చెప్పారు.