అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. శింగనమల నియోజకవర్గం లో పింఛన్ అడిగినందుకు వృద్ధుడిపై వాలంటీర్ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి గ్రామం లో ఈ ఘటన జరిగింది. పింఛన్ ఇప్పించాలంటూ గోవిందంపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ లోకేశ్వర రెడ్డి ని వృద్ధుడు వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి చేసాడు.
పింఛన్ ఇప్పించేందుకు గాను రూ.5 వేలు డిమాండ్ చేసాడు వాలంటీర్. ఎనిమిది నెలల క్రితం సోదరుడు రామకృష్ణారెడ్డి ద్వారా రూ.5 వేలు వాలంటీర్ కు వెంకటరామిరెడ్డి ఇచ్చారు. అయితే 8 నెలలు అయినా ఇంకా తనకు పించన్ రాలేదని డబ్బులు ఇవ్వాలని వాలంటీర్ ని అడగగా మద్యం మత్తులో దాడి చేసాడు. దీనితో వాలంటీర్ పై బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసారు. వెంటనే వాలంటీర్ ను సస్పెండ్ చేసారు.