పేటియం క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. వాళ్లే టార్గెట్..

-

డిజిటల్ లావాదేవీల్లో దూసుకుపోతున్న పేటియం సరికొత్త ప్రణాళికతో వస్తుంది. డిజిటల్ పేమెంట్లు పెరిగిన తర్వాత పేటియం వాడకం విపరీతంగా పెరిగింది. దాంతో కంపెనీ ఆదాయం బాగా పెరిగింది. ఐతే తాజాగా పేటియం నుండి క్రెడిట్ కార్డులు వస్తున్నాయట. ఆల్రెడీ క్రెడిట్ కార్డు సర్వీసుల్లో ఉన్న కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పర్ఛుకుని పేటియం కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులని మార్కెట్లోకి తీసుకురానుంది.

వచ్చే 12నుండి 18నెలల్లో 20లక్ష్ల క్రెడిట్ కార్డులని ఇష్యూ చేయాలని ప్లాన్ చేస్తోందట. క్రెడిట్ కార్డులు కొందరికే అందుబాటులో ఉన్న కారణంగా యూత్ ని టార్గెట్ చేస్తూ క్రెడిట్ కార్డులు ఇష్యూ చేయడానికి వస్తోందట. మొత్తానికి డిజిటల్ లావాదేవీలో అగ్రగామిగా నిలుస్తున్న పేటియం ఆర్థికపరమైన లావాదేవీల్లో దూసుకుపోతుందనడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news