అన్ని షరతులకీ ఒప్పుకున్న ఏపీ.. ఇక తెలంగాణా ఏమంటుందో ?

-

ఎట్టకేలకు ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసి. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయంలో ఒకటి రెండో రోజుల్లో క్లారిటీ రావచ్చని అంటున్నారు. తెలంగాణ కోరిన విధంగానే 1.05 లక్షల కిలో మీటర్లు తగ్గించుకున్నామని ఏపీఎస్సార్టీసీ ఎండీ కృష్ణబాబు పేర్కొన్నారు. వాళ్లు ప్రతిపాదించిన రూట్లల్లో కూడా ఏపీ బస్సులను తక్కువగా తిప్పేందుకు అంగీకరించామని ఆయన అన్నారు.

తెలంగాణ పెట్టిన షరతుల వల్ల విజయవాడ-హైదరాబాద్ రూట్లో సుమారు 350 బస్సులు తిరిగే అవకాశం ఉండదని ఏపీఎస్సార్టీసీకి నష్టం చేకూర్చేలా ఉన్నా.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరించామని కృష్ణ బాబు పేర్కొన్నారు. ఇలా ఒప్పుకోవడం వలన ఏడాదికి సుమారు రూ. 265 కోట్ల మేర రెవెన్యూ లాస్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరించాం కాబట్టి తెలంగాణ నుంచి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news