తెలంగాణ సాధనలో తన ప్రాణాలను సైతం లెక్కచేకుండా పోరాడిన కేసీఆర్ ని ఓడించడానికి నాలుగు పార్టీలు ఏకమయ్యాయి. సోమాజిగూడలో తెరాస అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీల్డ్ కవర్ సీఎం…కావలో సింహంలాంటి సీఎం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మహాకూటమి పొరపాటున గెలిస్తే నెలన్నరకో సీఎం మారతాడని ఎద్దేవా చేశారు. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని పెద్దలు అన్నమాటను గుర్తు చేస్తూ కూటమిపై సెటైర్ల వర్షం కురిపించారు. పేదవారికి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే దమ్మున్న కేసీఆర్ అధికారంలోకి రావాలన్నారు. కేటీఆర్ వెంట దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు రోడ్ షోలో పాల్గొన్నారు.
ఒక్కడ్ని ఓడించడానికి నాలుగు పార్టీలు ఏకమయ్యాయి…కేటీఆర్
-