పబ్జీ మొబైల్ లైట్ పై నిషేధం.. తెలుసుకోవాల్సింది ఏమిటంటే..?

-

దేశవ్యాప్తంగా పబ్జీ ఆడే ప్రతీ ఒక్కరికీ ఇది షాక్ కలిగించే వార్తే. ఇండియాలో పబ్జీ మొబైల్ లైట్ తన సేవలన్నింటినీ నిలిపివేసింది. భారత ప్రభుత్వం పబ్జీ మొబైల్ పై నిషేధం విధించిన తర్వాత చాలా మంది మొబైల్ ఫోన్లలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న పబ్జీ మొబైల్ లైట్ ద్వారా గేమ్ ఆడుతూ వచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం పబ్జీ మొబైల్ లైట్ ఈ రోజు నుండి ఇండియాలో పనిచేయడం ఆగిపోతుంది. అంటే ఈ రోజు నుండి అందుబాటులో ఉండదు.

ఈ మేరకు టెన్సెంట్ గేమ్స్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అందువల్ల మీ మొబైల్ లో పబ్జీ మొబైల్ లైట్ డాన్లోడ్ చేసి ఉన్నా కూడా ఆడడానికి వీలు లేదు. ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు ప్రకారం పబ్జీ మొబైల్ ఇండియా తన హక్కులన్నింటినీ పబ్జీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి అప్పగించేసిందని చెప్పుకొచ్చింది. ఇంకా వ్యక్తిగత సమాచారాన్ని కాపాడడంలో పబ్జీ మొబైల్ చాలా గట్టిగా నిలబడిందని తెలిపింది.

పబ్జీ ఫేస్ బుక్ పోస్ట్ ఈ విధంగా ఉంది.

సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రభుత్వం నిషేధించిన ప్రకారం టెన్సెంట్ గేమ్స్ తన పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ సేవలని అక్టోబర్ 30వ తేదీ నుండి నిలిపివేస్తుంది. ఈ మేరకు పబ్జీ మొబైల్ రైట్స్ ని పబ్జీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి తిరిగి ఇచ్చేసాము.

వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపర్చడంలో మేమెప్పుడూ ముందున్నాము. మా పాలసీ ప్రకారం అలాంటి సమాచారం బయటకు వెళ్ళే అవకాశమే లేదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. ఏదేమైనా ఇండియాలో మాకు లభించిన సపోర్టుకి దన్యవాదాలు తెలియజేస్తున్నాము.

చైనాకి చెందిన 118 మొబైల్ గేమ్స్ అన్నింటినీ ఇండియా బ్యాన్ చేసింది. వినియోగదారుల సమాచారాన్ని వాడుకుంటున్నారన్న ఉద్దేశ్యంతో మ్యూజిక్ వీడియో యాప్ టిక్ టాస్ సహా పలు యాప్స్ పై నిషేధం విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news