సబ్బం హరిని కనీసం ‘ఆర్కే’ కూడా రికమండ్ చేయలేదా?

-

విశాఖ ప్రవక్త, మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీడీపీ నేత, సబ్బం హరి కాంగ్రెస్ లో ఉండగా వైఎస్సార్ పుణ్యమాని ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అయితే అనంతర కాలంలో జగన్ వెనక తిరిగే ప్రయత్నం చేసినా.. కాలం కలిసి రాక ప్రస్తుతం బాబు పంచన కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి! ఈ పరిస్థితుల్లో టీడీపీలో సబ్బం హరి స్థానం ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి!

అవును… ప్రస్తుతం పసుపు మీడియా విశ్లేషకుడిగా మారడంతోపాటు.. హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయే స్థాయిలో బాబును పొగుడుతున్న సబ్బం హరి ప్రస్తుతానీ ఏ పదవీ లేని ఒంటరి! ఈ క్రమంలో ఆయన అభిమానులు, విశాఖ టీడీపీ శ్రేణులు తెగ ఫీలవుతున్నారంట. అందుకు కారణం… ఇటీవల పంచిన పార్టీ పదవుల్లో హరికి కనీసం పొలిటి బ్యూరో మెంబర్ కూడా ఇవ్వకపోవడమే!

అవును.. ప్రస్తుతం హరి అభిమానులు ఆవేదనకు బాబు తీసుకున్న నిర్ణయమే కారణం! పార్టీ కోసం గట్టిగా మాట్లాడుతున్న హరి వంటి నేతను గుర్తించకపోవడంతో ఆయన అభిమానులు హర్ట్ అయినట్లు చెబుతున్నారు. ఎందుకంటే… బాబు ఆశల సౌధం అమరావతిని ముందుగా వ్యతిరేకించింది కూడా సబ్బం హరినే! విశాఖకు రాజధాని వద్దు అనడంలో ఆయన గొంతు చాలా బలంగా వినిపించింది! ఇది పార్టీ స్టాండ్ కు పూర్తి అనుకూలం!

ఈ పరిస్థితుల్లో హరికి తగిన గుర్తింపు దొరకడం లేదనేది ఆయన ఫ్యాన్స్ ఆవేదన. సబ్బం హరి అంత కష్టపడుతున్నా కూడా బాబు ఆయనను ఇంకా పూర్తి టీడీపీ నేతగా గుర్తించడం లేదా అనేది వారి అవేదనగా ఉంది! ఈ క్రమంలో.. మరి రాష్ట్రస్థాయి పోస్టుల్లో ఏమైనా సబ్బం హరికి ఒకటి పంచుతారా లేదా అనేది వేచి చూడాలి!! అయితే ఈ విషయంలో ఇప్పటివరకూ ఏబీఎన్ రాధాకృష్ణ ఛానల్ కు ఆస్థాన విశ్లేషకుడిగా కూడా పనిచేస్తున్న వ్యక్తికోసం.. ఆర్కే ఆమాత్రం రికమండేషన్ చేయలేకపోయారా అన్నది మరో హాట్ టాపిక్!!

Read more RELATED
Recommended to you

Latest news