వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన రఘురామ కృష్ణంరాజు ప్రస్తుతం జగన్ సర్కార్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వైసిపి పార్టీ కి కొరకరాని కొయ్యగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు లేవనెత్తని అంశాలను సైతం తెరమీదికి తెచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చిన రఘురామ కృష్ణంరాజు జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు.
స్వతంత్రం కోసం పోరాడినప్పుడు మహిళలపై దాడులు జరిగినట్లు గాని ప్రస్తుతం అమరావతి కోసం పోరాడుతున్న మహిళలపై దాడులు జరుగుతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు రఘురామకృష్ణంరాజు. విశాఖకు రాజధాని వెళ్తే భూముల ధరలు పెరుగుతాయన్న కారణంతోనే ఎంతోమంది రాజధాని మార్పు కు మద్దతు పలుకుతున్నారు అంటూ ఆరోపించిన రామకృష్ణంరాజు… విశాఖలో అక్రమాలు పెరిగిపోతాయని అక్కడి ప్రజలు మాత్రం తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే తన పర్యటనకు ఆటంకం కలిగించేందుకు కోడిగుడ్లతో దాడి చేయాలని అన్ని చర్చ్ లకు ఆదేశాలు కూడా వెళ్లాయి అని తనకు సమాచారం అందింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.