ముంబై ఇండియన్స్‌ టీమ్ ఓనర్లు ఎక్కడ…?

-

ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్లో టాప్‌ ప్లేసులో దూసుకుపోతున్న టీమ్‌. అందరికంటే ఫస్ట్‌.. ప్లేఆఫ్‌కు చేరిన జట్టు. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతోంది రోహిత్‌ సేన. మరి, ఆ జట్టు ఇంత మంచిగా ఆడుతున్నా.. టీమ్‌ ఓనర్లు ఎందుకు కనిపించడంలేదు ? ఎప్పుడూ ఆటగాళ్లలో జోష్‌ నింపే.. అంబానీ ఫ్యామిలీ ఈసారి కనిపించకపోవానికి కారణం ఏంటి ?

ముంబై ఇండియన్స్‌.. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే ఓడింది. మొత్తం 18 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో టాప్‌ ప్లేసులో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌ ప్రదర్శన అంత బాగానే ఉంది కానీ.. ఎప్పుడూ డగౌట్‌లో కనిపించే ఆ జట్టు ఓనర్స్‌ మాత్రం ఈసారి కనిపించడంలేదు. ముఖేశ్‌ అంబానీ ఫ్యామిలీ.. దుబాయ్‌ ఐపీఎల్లో మిస్‌ అయినట్లు కనిపిస్తోంది. మామూలుగా ఇండియాలో జరిగే మ్యాచ్‌ల్లో అయితే.. ముఖేశ్‌ అంబానీ భార్యతో పాటు పిల్లలు కూడా హాజరయ్యేవారు. జట్టును దగ్గర ఉండి ప్రోత్సహించేవారు. కానీ, ఈసారి టీమ్ దుమ్మురేపుతున్నా.. ముంబై ఇండియన్స్‌ ఓనర్స్‌ మాత్రం ఎందుకు కనిపించడంలేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.

కరోనా నిబంధనలతో దుబాయ్‌లో ఐపీఎల్‌ ప్రత్యేకంగా సాగుతోంది. ప్రేక్షకులు లేకపోయినా.. ఆయా జట్ల ఓనర్స్‌, టీమ్‌ స్టాఫ్‌.. మ్యాచ్‌ను చూస్తూ జట్టును ప్రోత్సహిస్తున్నారు. నైట్‌ రైడర్స్‌ ఓనర్‌ షారుఖ్‌ ఖాన్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ కో-ఓనర్‌ ప్రీతి జింతా.. మ్యాచ్‌ల సందర్భంగా తళుక్కుమంటున్నారు. అయితే ముంబై ఇండియన్స్‌ ఓనర్స్‌ మాత్రం ఎందుకు కనిపించడంలేదంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్వారంటైన్‌ నిబంధనలు, బిజినెస్‌లలో బిజీగా ఉండటమే కారణమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్‌కు చేరడంతో.. ఇక చివరి మ్యాచ్‌ల్లోనైనా.. వాళ్లు కనిపిస్తారో, లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news