దుర్గ గుడి మీద బండరాళ్ళు విరిగి పడిన ఘటన సంచలనం అయింది. ఈ నేపధ్యంలో బెంగళూరుకి చెందిన బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. మాధవ్ ఐఐటీ ప్రొఫెసర్ శివ కుమార్ మాట్లాడుతూ… 12 ఏళ్ల నుండి కొండ చరియలు గురించి సలహాలు ఇస్తున్నాం అన్నారు. ఘాట్ రోడ్డు విస్తరణ కు కొండను తవ్వారు అని ఆయన పేర్కొన్నారు. అపుడు కొండ ప్రాంతం దెబ్బతింది అని వివరించారు.
ఫెన్సింగ్ ద్వారా కొంత మేరకు కట్టడి చేశారని వివరించారు. ఈ కొండ రాయి రాక్ ఫాల్ టైప్ అన్నారు ఆయన. ఫెన్సింగ్, కేబుల్, హైడ్రో సీలింగ్ చేస్తే ప్రమాద తీవ్రత ను తగ్గించవచ్చు అని వివరించారు. కొండ గట్టిదే కానీ కొండ మీద వర్షం వచ్చినపుడు నీరు ఆగితే ప్రమాదం అన్నారు. కొండ మీద నీరు నిల్వ లేకుండా బయటకి పంపేందుకు సలహాలు ఇచ్చాము అని చెప్పారు. కొండ చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేస్తే కొండ చరియలు పడినా ప్రమాదాలు నివారించవచ్చు అని అన్నారు. హైడ్రో సీలింగ్(సీడ్స్ వేసి చిన్న సైజ్ చెట్లు పెంచితే) చేస్తే ప్రమాదాలు జరగవు అన్నారు.