దివంగత హాలీవుడ్ నటుడు సీన్ కానరీకి ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. అంతరిక్షంలోని ఓ గ్రహ శకలానికి సీన్ కానరీ పేరు పెట్టింది నాసా. సీన్ కానరీ జేమ్స్ బాండ్ పాత్రతో ఎంతో ప్రాచుర్యం పొందారని ఈ సందర్భంగా నాసా కొనియాడింది. ది నేమ్ ఆఫ్ ద రోజ్ చిత్రంలో సీన్ కానరీ ప్రతిభకు గుర్తుగా ….ఒక ఆస్ట్రాయిడ్‌కు అతని పేరు పెట్టినట్టు నాసా తెలిపింది.
ఈ విషయాన్ని నాసా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. సీన్ కానరీ ‘ది నేమ్ ఆఫ్ రోజ్’ చిత్రంలో నటించినందుకు గ్రహశకలానికి ఆయన పేరు పెట్టినట్లు నాసా సూచించింది. 1979లో సైన్స్ ఫిక్షన్ మూవీ ‘మెటోర్(ఉల్కాపాతం)’ అనే చిత్రంలో నటించారు. ఇందులో గ్రహశకలం వల్ల కలిగిన ముప్పు నుండి భూమిని రక్షించడానికి నాసా చేసిన ప్రయత్నాలకు ఆయన నాయకత్వం వహించారు. ఇప్పుడు నాసా మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య ఉన్న ఉల్కకు సీన్ కానరీ పేరు పెట్టినట్లు నాసా వెల్లడించింది.