ప్రేక్ష‌కుల‌కు బాహుబ‌లితో ఎర‌.. “బాహుబ‌లి” మ‌ళ్ళీ వ‌స్తున్నాడ‌హో

-

క‌రోనా నామ సంవ‌త్స‌రం 2020 క్లైమాక్స్‌కి వ‌చ్చేసింది. కరోనా వచ్చి ఆరున్నర నెలలపాటుగా థియేటర్లన్నింటినీ మూసి వేసింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డం, ప్ర‌జ‌ల‌కు ధైర్యం పెర‌గ‌డంతో థియేటర్లకి అనుమతి లభించింది. కానీ యాభై శాతం సీటింగ్ కెపాసిటీ అన్న షరతుతో మాత్రమే. థియేటర్లు తెరుచుకున్నా కానీ సినిమా చూడడానికి ప్రేక్షకుడు రాలేకపోతున్నాడు. దీంతో సినిమా హాళ్ళు బోసిపోతున్నాయి.

ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కి రావ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేక‌పోవ‌డంతో కొత్త సినిమాలు రిలీజ్ చెయ్య‌డానికి నిర్మాత‌లు వెన‌క‌డుగు వేస్తున్నారు. సినిమా బాగున్నా బాగుప‌డేది క‌ష్టం.. అందునా పైర‌సీ గోల‌.. ఇది ఇలాగే కొన‌సాగితే క‌ష్ట‌మ‌నుకున్న సినీ పెద్ద‌లు ఒక ఆలోచ‌న‌కైతే వ‌చ్చేశారు. భారతీయ సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన బాహుబ‌లి చిత్రాన్ని మ‌ళ్ళీ రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు.

ఈ శుక్రవారం( నవంబరు వ తేదీన) బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అవుతుండగా, వచ్చే శుక్రవారం కంక్లూజన్ రిలీజ్ అవుతుందట. కరోనా టైమ్ లో థియేటర్లలో సందడి చేయబోతున్న బాహుబలి చిత్రానికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news