ఆ 10 స్కూల్స్ జీఓ 46 ని ఉల్లంఘించాయి !

-

జంట నగరాల వ్యాప్తంగా 10 స్కూల్స్ జీఓ 46ని ఉల్లంఘించాయని విచారణ అధికారులు రిపోర్ట్ లో పేర్కొన్నారు. కరోన నేపథ్యంలో ఈ విద్య సంవత్సరం లో గత విద్యా సంవత్సరం లో ఉన్న ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని, అది కూడా నెల వారీగా తీసుకోవాలని జీఓ 46ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. జీఓను ఉల్లంఘించాయని పలు స్కూల్స్ పై ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో 11 పాఠశాలల పై సమగ్ర విచారణకు విద్యా శాఖ ఆదేశించారు. జాయింట్ డైరెక్టర్ లను విచారణ అధికారులుగా పాఠశాల విద్యాశాఖ నియమించగా ఆ విచారణ అధికారులు సమగ్ర విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చారు.

10 స్కూల్స్ నిబంధనలు ఉల్లంఘించాయని ఆధారాలతో సహా రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. అలానే మరో స్కూల్ విషయంలో రికార్డ్స్ పరిశీలించడానికి మరింత టైమ్ కావాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్స్ ఇలా ఉన్నాయి, మౌంట్ లిటేరా జీ స్కూల్, మెరిడియన్ స్కూల్, జూబిలీ హిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి పబ్లిక్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, కల్ప స్కూల్, సెయింట్ ఆండ్రూస్ సికింద్రాబాద్, సెయింట్ ఆండ్రూస్ మేడ్చల్, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ హిమాయత్ నగర్, నీరజ్ పబ్లిక్ స్కూల్ అమీర్పేట్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news