జెర్సీ నెంబర్ ’18’.. ఈ స్టోరీ మీకు తెలుసా..!

-

భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఒక ప్రళయం అని చెప్పాలి. సాదా సీదా క్రికెటర్గా భారత జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ దిగ్గజ క్రికెటర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత భారత జట్టు సారథ్య బాధ్యతలు కూడా తీసుకుని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక నేడు విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ సినీ రాజకీయ రంగ ప్రముఖులు విరాట్ కోహ్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ జెర్సీ కి సంబంధించిన ఒక స్టోరీ వైరల్ గా మారిపోయింది.

సాధారణంగా విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 దర్శిస్తూ ఉంటాడు వెనుక పెద్ద కారణమే ఉంది. 2006 డిసెంబర్ 18వ తేదీన విరాట్ కోహ్లీ తండ్రి మరణించారు. ఇక అదే సమయంలో విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఇక అప్పటినుంచి విరాట్ కోహ్లీ తన తండ్రి గుర్తుగా 18 నెంబర్ జెర్సీ ధరిస్తూ వస్తున్నాడు. తన తండ్రి మరణించిన సమయంలో ఏకంగా ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడి అంత్యక్రియలకు వెళ్ళాడు విరాట్ కోహ్లీ.

Read more RELATED
Recommended to you

Latest news