‘బుట్టబొమ్మ’ ని వదలని వార్నర్.. జట్టు అందరితో డాన్స్..!

-

గతంలో లాక్డౌన్ సమయంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమా నుంచి బుట్ట బొమ్మ అనే పాట పై డేవిడ్ వార్నర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసింది. ఇక మొన్నటికి మొన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రాక్టీస్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కూడా బుట్ట బొమ్మ పాట పై డాన్స్ చేశాడు. ఇలా సంతోషంగా ఉన్న ప్రతి సారి కూడా బుట్ట బొమ్మ పాట పై డాన్స్ చేస్తూ అటు తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరవుతారు డేవిడ్ వార్నర్.

ఇక ఇప్పుడు మరో సారి బుట్ట బొమ్మ పాట పై డాన్స్ చేసి అదరగొట్టాడు అయితే మొన్నటి వరకు ఒక్కడు మాత్రమే బుట్ట బొమ్మ పాట పై డాన్స్ చేయగా ఇప్పుడు మాత్రం ఏకంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అందరి ఆటగాళ్లతో బుట్ట బొమ్మ పాట పై డాన్స్ చేశాడు డేవిడ్ వార్నర్ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులందరూ మురిసిపోతున్నారు.https://youtu.be/xh5BVKOrFog

Read more RELATED
Recommended to you

Latest news