నవంబర్ -8 – ఆశ్వీయుజ మాసం- ఆదివారం.
మేషరాశి: ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి !
ఈరాశి వారికి గ్రహసంచారం ఫలితంగా జీవిత భాగస్వామి నుంచి సహాయం లభిస్తుంది. సాయంత్రం పనిలో ఆటంకం కలిగే సమస్యలు ఉండవచ్చు. మీకిష్టమైన వారిని కలవడానికి రాత్రి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. సంతానం నుంచి నిరాశ పరిచే వార్తలను వింటారు.
పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి.
వృషభరాశి: ఈరోజు ప్రయోజనాలు పొందుతారు !
పాలన, అధికారం నుంచి ఉమ్మడి భాగస్వామ్యం కలసి వస్తుంది. ఫలితం ప్రయోజనం అందుకుంటారు. నూతన ఒప్పందాల ద్వారా ర్యాంకింగ్ మెరుగుపడుతుది. సంతానం నుంచి కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు సంతృప్తి కరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
పరిహారాలుః సూర్యారాధన చేయండి మంచి ఆరోగ్యాన్ని పొందండి.
మిథునరాశి: ఈరోజు మీ పిల్లలు విజయం సాధిస్తారు !
ఈరోజు పనులు చేసేటప్పుడు జాగ్రత్త. పిల్లల చదువుకు సంబంధించిన పోటీలో ఊహించని విజయం అందుకుంటారు. ఈరోజు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆధాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అధికారాన్ని తిరిగి పొందుతారు. వీలైనంత వరకు అనవసర ఖర్చులు చేయకుండా ఉండండి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.
పరిహారాలుః ఇష్టదేవతరాధనతోపాటు ఆవునెయ్యితో ఇష్టదేవతారాధన చేయండి.
కర్కాటకరాశి: ఈరోజు మీ సంపద పెరిగే అవకాశం !
ఈరోజు చంద్రగ్రహ అనుకూలత వల్ల సంపద పెరుగుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు మీకిష్టమై వ్యక్తులను కలుస్తారు. వారి నుంచి శుభవార్తలు అందుకుంటారు. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. ప్రయాణం పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.
పరిహారాలుః శ్రీసూక్తపారాయణం చేయండి.
సింహరాశి: ఈరోజు కంటి సంబంధ బాధలు రావచ్చు జాగ్రత్త !
గ్రహచలనం వల్ల నూతన ఆదాయ వనరులు సృష్టించుకోగలుగుతారు. ఈరోజు విజయాన్ని పొందుతారు. కంటి లోపాలను కలిగే అవకాశముంది. మీ మాటలతో గౌరవ, మర్యాదలు పెంచుకుంటారు. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.
పరిహారాలుః సూర్యారాధన చేయండి. ఆరోగ్యం పొందండి.
కన్యరాశి: ఈరోజు అదృష్టాన్ని పొందుతారు !
ఈరోజు గ్రహచలనరీత్యా అదృష్టాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో అనూహ్యమైన విజయాన్ని సాధిస్తారు. మీ సంతానం నుంచి సంతృప్తికరమైన శుభవార్తలు పొందుతారు. ఈరోజు కోర్టు వ్యవహారాల కోసం లాయర్లను, నిపుణులను సంప్రదించండి. ఈరోజు శుభకార్యం కోసం ఖర్చులు చేస్తారు. కీర్తి పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.
పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి.
తులరాశి: ఈరోజు మీకు ఆనందం !
ఈరోజు కుటుంబ సభ్యులందరి ఆనందం పెరుగుతుంది. చాలా రోజులుగా కొనసాగుతోన్న లావాదేవీల సమస్యలు పరిష్కారం అవుతుంది. చేతిలో తగినంత డబ్బు ఉన్నందుకు మీకు ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్టమైన పదార్థాలను తింటారు.
పరిహారాలుః సూర్యారాధన చేయండి. మంచి ఫలితాలను పొందండి.
వృశ్చికరాశి: ఈరోజు ఆరోగ్యం పై దృష్టిపెట్టండి !
ఈ రాశివారికి చంద్రయోగం మరో వారం పాటు ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
పరిహారాలుః సూర్యాష్టకం చదవండి. సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేయండి.
ధనస్సురాశి: ఈరోజు ప్రశంసలు అందుకుంటారు !
ఈరోజు సాఫీగా సాగుతుంది. మీ అత్తమామల నుంచి తగినంత మొత్తం బహుమతిగా లభిస్తుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. ఈ రోజు ప్రత్యర్థుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు అధికార పార్టీ నుంచి ప్రయోజనం పొందుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించే వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన చివరికి అనుకున్నది సాధిస్తారు. ఈ రోజు మీకు ఇంట్లో ముష్టాన్న భోజనం, విశ్రాంతి లభిస్తాయి.
పరిహారాలుః శ్రీలక్ష్మీ దేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
మకరరాశి: ఈరోజు మంచి గౌరవం లభిస్తుంది !
ఈరోజు చేసే కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కింది ఉద్యోగుల నుంచి గౌరవం, మద్దతు పొందుతారు. ఈ రోజు మీరు కుటుంబ, ఆర్థిక విషయాల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు ఎవరితో వివాదాల జోలికి వెళ్లకండి. తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
పరిహారాలుః శ్రీపురుషసూక్త పారాయణం చేయండి.
కుంభరాశి: ఈరోజు శత్రువులను నియంత్రిస్తారు !
ఈరోజు అనవసర వివాదాలు వస్తాయి జాగ్రత్త. అయితే గ్రహచలనం రీత్యా శత్రువులను నియంత్రించగలుగుతారు. సమ్యసలను ఓపికతో పరిష్కరించుకోండి. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోండి. కుటుంబంలో అసంతృప్తి ఉంటుంది. పిల్లల బాధలను వినండి. వీలైతే సహాయం చేయండి.
పరిహారాలుః శ్రీహనుమాన్ చాలీసాను పారాయణం చేయండి.
మీనరాశి: ఈరోజు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి !
ఈరోజు వైవాహిక జీవితంలో చాలారోజులుగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు బంధువులతో మనస్పర్థలు వచ్చే అవకాశముంది. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను పోయే అవకాశముంది జాగ్రత్త.
పరిహారాలుః సూర్యోదయ సమయంలో ఆదిత్యహృదయం పఠించండి. మంచి ఫలితాలు వస్తాయి.
-శ్రీ