దారుణం : రెండో సారి కరోనా.. యువ డాక్టర్ బలి

-

కరోనా వైరస్ ఇప్పుడు రెండో సారి కూడా సోకుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండో సారి కరోనా బారిన పడిన వాళ్ళు కూడా కోలుకుంటున్నారు. అయితే దురదృష్టవశాత్తూ రెండో సారి కరోనా బారిన పడిన ఓ యువ డాక్టర్‌ మాత్రం తన ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సంకలనంగా మారింది. బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల చిల్డ్రన్స్ డాక్టర్‌ నంద కుమార్‌ కు మూడు నెలల క్రితం కరోనా సోకింది. అయితే ఆయన గుంటూరులోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఆ తరువాత కోలుకున్నారు.

తర్వాత యథావిధిగా విధులకు కూడా హాజరయ్యారు. అయితే… 15 రోజుల క్రితం మళ్ళీ జ్వరం రావడంతో ముందు జాగ్రత్తతో కరోనా పరీక్ష చేయించుకోగా మరోసారి పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినా తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు కడప రిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లారు. అయితే అక్కడి వైద్యులు తమ వల్ల కాదని చెప్పి ఆయన్ని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ కూడా అయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ నందకుమార్‌ చనిపోయారు. దీంతో రెండో సారి కరోనా సోకితే లైట్ తీసుకోవద్దని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news