హాస్టల్ యాజమాన్యం వేధింపులు..విద్యార్ధిని సూసైడ్..!

హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా… షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య…ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా…బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించింది యాజమాన్యం. దాంతో స్వగ్రామానికి వచ్చిన ఐశ్వర్య…ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. అయితే కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.